ఏపీలో నాలుగు సంవత్సరాల పాటు దోపిడిదారులు, కబ్జాదారులు, గుండాలు రాజ్యాన్ని ఏలారు.ఏపీలో గతంలో అధికారంలో ఉన్న గడ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి నిమ్మకాయ నీళ్ల కోసమంటూ జనం సొమ్ము 28 లక్షలు అప్పనంగా దోచేశారని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. జనం సొమ్ము కాబట్టే నిమ్మకాయ నీళ్లు తాగినంత ఈజీగా నిమ్మకాయ నీళ్ల కోసం 28 లక్షలు దిగమింగేశారని ఆరోపించారు. ఆ టిడ్కో ఇల్లు పేదలకు మంజూరు చేయడానికి 3 లక్షల నుంచి 4 లక్షలు దండుకున్నారని మండిపడ్డారు దోపిడీకి హద్దులేదా జగన్, ప్రజాధనం మెక్కడానికి సిగ్గులేదా అని లోకేశ్ విరుచుకుపడ్డారు.
గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి 70 లక్షలు బిల్లులు చేసుకోవడానికి గడ్డం గ్యాంగ్ విశ్వప్రయత్నాలు చేసిందని తెలిపారు. అమృత్ పథకం కింద పనులు చేయకుండానే కోట్లు కొల్లగొట్టేశారని ఆరోపించారు. ఐదేళ్ల జగన్ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడ నియోజకవర్గాన్ని గుల్ల చేసిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని లోకేశ్ తెలిపారు.