జగన్ జీవితకాలమంతా జైళ్లకే…ఓ ముద్దాయిని పరామర్శించడానికి మరో ముద్దాయి వెళ్లడం ఏంటో!

జగన్ జీవితకాలమంతా జైళ్లకే…ఓ ముద్దాయిని పరామర్శించడానికి మరో ముద్దాయి వెళ్లడం ఏంటో!

ఏపీకి నేరస్తులు, ముద్దాయిల రాజ్యం నుంచి విముక్తి లభించిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో జరిగిన అన్ని అవకతవకలను బయటకు తీసుకుని వస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖ దస్పల్లా భూములు, క్రిష్టియన్ భూములలో జరిగిన అన్యాయాలను బయటపెడతామని స్పష్టం చేశారు. 

గత అధికార పార్టీ భూ కబ్జాలపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన క్రిమినల్ ని జగన్ కలవడం సిగ్గుచేటని, గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చరిత్ర జగన్ ది అని ఆయన మండిపడ్డారు.  బాబాయ్ తెల్లవారుజామున 5 గంటలకు చనిపోతే సాయంత్రం ఐదు గంటలకు వెళ్లిన జగన్‌.. పిన్నెల్లి ని మాత్రం చార్టెడ్ ఫ్లైట్లో వెళ్లి పరామర్శించడం ఏంటో అని ఆయన విమర్శించారు. జగన్ వ్యవహార శైలి చూశాక ‘ఇక మారడు’ అని ప్రజలకు కూడా తెలిసిపోయింది. తమ ప్రభుత్వం వచ్చిన 23 రోజుల్లోనే ఏదో అయిపోయినట్టు జగన్ గగ్గోలు పెడుతున్నాడని విమర్శించారు. ఇప్పటికే ప్రజలు తనకు గట్టి బుద్ధి చెప్పినప్పటికీ ఆ విషయం ఇంకా జగన్‌ కి అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. 

కనీసం రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ నెల్లూరు జిల్లాకు వచ్చి చంద్రబాబుని విమర్శించడం హాస్యాస్పదమని ఆనం రామానారయణ రెడ్డి విమర్శించారు. భవిష్యత్ లో వైసీపీ మనుగడ సాధించలేదని జగన్మోహన్ రెడ్ది చెప్పి వెళ్లారని దుయ్యబట్టారు.  నెల్లూరు, కడప జిల్లాల్లోని లే అవుట్లలో అక్రమాలు జరిగాయాన్ని చంద్రబాబు సూచించడంతో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. 

40 వేల కోట్లు కొల్లగొట్టిన మనీలాండరింగ్ కేసులో 11 కు పైగా ఛార్జ్ షీట్ లు ఉన్న వ్యక్తి మొన్నటివరకు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేయడం దురదృష్టకరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఒక రిమాండ్ ఖైదీని.. ఎన్నో కేసుల్లో ఛార్జ్ షీట్ లు ఎదురుక్కొంటున్న మరో ముద్దాయి జగన్ రెడ్డి నెల్లూరు జైల్లో ములాఖత్ అయ్యారని ఆయన విమర్శించారు. ఇద్దరు ముద్దాయిలు కలిసి నెల్లూరు జిల్లా జైల్లో దాదాపు 22 నిమిషాలు యోగక్షేమాలు మాట్లాడుకున్నారని ఎద్దేవా చేశారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories