క్యాలెండర్ సాంగ్‌ లో మిస్‌ యూనివర్స్‌..!

స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌, కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా విడుదలకి ఇంకా రెండు వారాల సమయం కూడా లేదు.దీంతో ఇండియన్ 2 మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇప్పటికే ట్రైలర్ విడుదల అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా నుంచి పాటలు కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి. తాజాగా క్యాలెండర్ సాంగ్ పేరిట మరో పాటని మూవీ టీమ్ విడుదల చేసింది. ఆ సాంగ్ చూసిన తర్వాత డైరెక్టర్ శంకర్ తన మార్క్ చూపించాడని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా డైరెక్టర్ శంకర్ సినిమా అంటే పాటలు మీద భారీ అంచనాలు ఉండనే ఉంటాయి.

ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ లో ఆ టచ్ మాత్రం కనపడలేదు. కానీ, తాజాగా వచ్చిన పాట మాత్రం వాటిని కొట్టిపడేసింది. అయితే శంకర్ తన సినిమా పాటల్లో కచ్చితంగా ఒరిజినల్ లొకేషన్స్‌లో తీసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అలాగే ఈ సాంగ్‌ని కూడా ఒక లైవ్ లొకేషన్ లోనే శంకర్ తీశారు.

ఈ సాంగ్ చూడటానికి మాత్రం బాగా రిచ్‌గా.. డైరెక్టర్ వింటేజ్ టచ్ కనిపిస్తోంది. ఈ పాట కోసం ఏకంగా 2017 మిస్ యూనివర్స్ అయిన డెమి లేయ్ టెబోని తీసుకున్నారు. ఆమె హాట్ హాట్ అందాలు ఈ పాటలో అదిరిపోయాయి. అయినా మోడల్స్‌ని వాడటంలో శంకర్ స్టైలే వేరు అనే విషయం అందరికీ తెలిసినదే.

Related Posts

Comments

spot_img

Recent Stories