బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకి టాలీవుడ్లో అంతగా అవకాశాలు రాలేదు. తర్వాత ‘దోచెయ్’, ‘ఆదిపురుష్’ సినిమాలు చేసింది. అవి కూడా పెద్ద డిజాస్టర్స్ కావడంతో.. బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ‘దో పత్తీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. గతేడాది వచ్చిన ‘మిమీ’ సినిమాలో తన నటనకుగానూ అంతర్జాతీయ అవార్డు ను కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రం తన జీవితాన్నే మార్చేసింది అంటూ చెప్పుకొచ్చింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులకు నచ్చే విధంగా కొన్ని సినిమాలు మాత్రమే వస్తాయి. కానీ వాళ్లకు నచ్చిందంటే మాత్రం మంచి సక్సెస్‌ను ఇస్తారు. నా ‘మిమీ’తో అదే జరిగింది. ఈ మూవీకి మంచి విజయాన్ని ఇచ్చారు. దీంతో నా కెరీర్ మరోస్థాయికి చేరుకుంది. ఆ సినిమా తర్వాత నాకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాను. ఓ నటిగా నా జీవితానికి కావాల్సినన్ని అద్భుతమైన క్షణాలను అందించిన ఈ సినిమా ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’ అంటూ వివరించింది.