ఆ పార్ట్‌ పై ప్రభాస్‌ పేరు టాటూ వేయించుకున్న బాలీవుడ్‌ భామ..కథేంటి?

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దిశా పఠానీ కల్కి 2898 ఏడీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే సినిమాలో ఆమె క్యారెక్టర్ గెస్ట్ రోల్ కు ఎక్కువ సపోర్టింగ్ రోల్ కు తక్కువ అన్నట్లుగా ఉందని విమర్శలు వచ్చాయి. ఆమె ఒప్పుకోకపోయినా బాగుండేదని అభిమానులు అనుకున్నారు.  అయితే అంత గొప్ప ప్రాజెక్ట్ లో ఈ అందాల భామ కూడా నటించినందుకు సంతోషడిన ఫ్యాన్స్ కూడా లేకపోలేదు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ భామ టాటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ముద్దుగుమ్మ చేతిపై ‘PD’ అని రాయించుకున్న ఇంక్ మార్క్ వేయించుకోగా.. దీని అర్థం ఏంటనే ఆలోచనలో పడిపోయారు నెటిజన్లు కల్కిలో ప్రభాస్ సరసన నటించిన బ్యూటీ.. డార్లింగ్ తో క్లోజ్ అయిపోయిందని, మనసు ఇచ్చేసింది కాబట్టి P ఫర్ ప్రభాస్.. D ఫర్ దిశ అన్నట్లుగా రాయించుకుందని కామెంట్లు పెట్టేస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టి పడేస్తున్నారు. PD ఫర్ పఠానీ దిశ అని చెప్తున్నారు. మొత్తానికి ఈ టాటూ అర్థం ఏంటో తెలియదు కానీ దిశ చేతిపై మాత్రం ఆ టాటూ మరింత అందంగా కనిపిస్తుందని.. తనకు కూడా అందాన్ని తెచ్చిందని అనుకుంటున్నారు

Related Posts

Comments

spot_img

Recent Stories