వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతటి ప్రజా వ్యతిరేకులో.. ప్రజల సమస్యలు వారికి ఎంత చులకనగా కనిపిస్తాయో అయిదేళ్లలో ప్రజలు గమనించారు. ఇప్పుడు దారుణమైన ఓటమి పలకరించిన తర్వాత కూడా ఆ పార్టీ నాయకుల్లో బుద్ధి రావడం లేదు. తమ ప్రజా వ్యతిరేక ఆలోచనలను ఇంకా నిస్సిగ్గుగా సమర్థఇంచుకుంటున్నారు. జగన్ పతనానికి కారకులైన కీలక నాయకుల్లో ఒకరైన బొత్స సత్యనారాయణ ఇప్పుడు మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో ఉన్నది కేవలం 6 వేల ఉపాధ్యాయ ఖాళీలు మాత్రమే కాగా, మెగా డీఎస్సీ పేరుతో 16వేల నియామకాలు చేపట్టడం ఎలా సాధ్యమని బొత్స ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబునాయుడు తాను సీఎం అయితే తొలిసంతకం మెగా డీఎస్సీ ఫైలుమీదనే పెడతానని ఎన్నికల ముందే ప్రకటించారు. అప్పటికే జగన్ సర్కారు ప్రకటించిన ఆరువేల పోస్టుల భర్తీ అనే మాయా డీఎస్సీ కోడ్ పుణ్యమాని ఆగింది. మాట నిలబెట్టుకుంటూ చంద్రబాబు రాగానే ఆఫైలుపై తొలిసంతకం పెట్టారు. డిసెంబరు 10లోగా నియామకాలు పూర్తయ్యేలా ఆ ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తయితే ఉపాధ్యాయ వర్గాల్లో చంద్రబాబు కీర్తి అమాంతరం పెరిగిపోతుందని వైసీపీలో కంగారు మొదలైంది.
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్నది 6వేల ఖాళీలే కాగా, 16వేల నియామకాలు ఎలా జరుగుతాయని ఎద్దేవా చేస్తున్నారు. బొత్సకు ధైర్యముంటే.. ఎన్నికల ముందే.. చంద్రబాబు మెగా డీఎస్సీ అన్నప్పుడు.. ఉన్నది 6వేల ఖాళీలే కాగా, మెగా డీఎస్సీ అనే మాట ఎలా వస్తుందని ప్రశ్నించి ఉండాల్సింది? అప్పుడు అలా చెప్పి ఉంటే.. ఇప్పుడు దక్కిన 11 సీట్లు కూడా దక్కి ఉండేవి కాదని ప్రజలు అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఖాళీలను కూడా తమ కళ్లతో చూడలేకపోయిన జగన్ ప్రభుత్వపు దుర్మార్గమైన తీరువల్లనే కదా.. ప్రజలు వారిని ఓడించింది అని అంతా వ్యాఖ్యానిస్తున్నారు.