ఓ ధనుంజయ వచ్చింది సూర్య పుత్ర కర్ణ…!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కల్కి మేనియా మొదలైపోయింది. వరల్డ్‌ వైడ్‌ గా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్స్‌ లో కల్కి 2898 ఏడీ సినిమాని విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు ఐదు షో లతో పాటు అదనంగా బెనిఫిట్‌ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ద్వాపర యుగంలో ఇతిహాసాలు వాటి నుంచి వెలువడిన పురాణాలను , భవిష్యత్‌ ను కలుపుతూ..ప్రభాస్‌ హీరోగా , నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన ఈ మూవీ పై ముందునుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందరు అనుకున్నట్లే ఆ అంచనాలను చేరుకువడంలో చిత్ర బృందం సక్సెస్ అయ్యింది.

సినిమా ప్రారంభమే మహాభారత ఎపిసోడ్‌ తో ప్రారంభమవుతుంది. అశ్వద్దామకు శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంభాషణతో మొదలైన ఈ సినిమా ముందుగానే ఆసక్తి రేకెత్తించేలా ఉంది. అశ్వద్దామగా అమితాబ్‌ బచ్చన్‌, అర్జునుడిగా విజయ్‌ దేవరకొండ నటించగా ప్రభాస్‌ కర్ణుడి క్యారెక్టర్‌ లో ప్రత్యక్షమవుతాడు.

మహాభారతంలో అశ్వద్దామకి అర్జునుడికి యుద్దం జరుగుతుండగా అశ్వద్దామ, అర్జునుడిని ఓడించలేకపోతాడు. చావుబతుకుల మధ్య ఉన్న అశ్వద్దామ పైన అర్జునుడు నిన్ను ఇంకా ఎవరు కాపాడలేరని పైన నేను బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్న ఇప్పటి వరకు దీన్ని ఆపలేదు అన్న సమయంలో ఓ యోధుడు బాణం వచ్చి ఆ బ్రహ్మాస్త్రం ఢీకొడుతుంది. దానితో రెండు అడుగులు అర్జునుడి రథం వెనక్కి వెళ్తుంది.

తరువాత అర్జునుడు ఇంకో బాణం ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ యోధుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్తుంది. అప్పుడు అర్జునుడు చూసావా కృష్ణ మనం రథం..రెండు అడుగుటు వెనక్కి వెళ్తే తన రథం 10 అడుగులు వెనక్కి వెళ్లింది…ఇతను నాకు పోటీనా అంటాడు. వెంటనే కృష్ణుడు ఓ ధనుంజయ నీ రథాన్నిఅగ్ని దేవుని వరం కాపాడుతుంది జెండాపై కపిరాజు నడుపుతుంది. ముల్లోకాలు నడిపించే నేను అయినా రెండు అడుగులు వెనక్కి వేశాను అంటే ఆలోచించు అర్జునా తాను సామాన్య యోధుడు కాదు తన కళ్లలో సూర్యుడు తేజస్సు చేతిలో ఓటమి ఎరగని విజయ ధనస్సు తన పేరు చరిత్ర మర్చిపోదు.

తన పేరు సూర్య పుత్ర వైకర్తన కర్ణ అన్న ఎంట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ప్రస్తుతం ఈ సీన్‌ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories