అవ్వతాతల్ని బలితీసుకున్న జగన్ కుట్రకు ఇదే రుజువు!

ఎన్నికలకు ముందు ఏం జరిగిందో ప్రజలందరికీ గుర్తుంది కదా? పెన్షన్ల కోసం పడే ఆరాటంలో పదుల సంఖ్యలో అవ్వతాతలు ఎండల్లోపడి ప్రాణాలు కోల్పోయిన సంగతులు అందరికీ తెలుసు కదా. ఇలా వృద్దులను రోడ్డు మీదికి రప్పించి వారి ప్రణాలను బలిగొన్న దుర్మార్గం.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ కుట్ర మాత్రమే అని.. ఇప్పుడు చంద్రబాబునాయుడు సాధికారంగా నిరూపించబోతున్నారు. జులై నెల ఒకటోతేదీన వృద్ధులు, వితంతవులు, వికలాంగులు.. అన్ని రకాల సంక్షేమ పథకాల పింఛన్లను లబ్ధిదారులకు ఇళ్లవద్దనే ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే ఒక్కరోజులోనే పింఛన్ల పంపిణీ జరగబోతోంది.

మూడునెలలుగా ఇళ్ల వద్ద ఇవ్వలేకపోవడం కేవలం జగన్ సర్కారు కుట్ర మాత్రమే అని తేటతెల్లం కాబోతోంది.
ఎన్నికలకు ముందు పలు ఫిర్యాదులు రావడంతో.. లబ్ధిదారులకు పింఛన్లు కోడ్ ఉన్నంత వరకు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఆదేశించింది. వాలంటీర్లను పక్కన పెట్టినప్పటికీ.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగుల ద్వారా.. లబ్ధిదారులకు ఇళ్లవద్దనే అందజేసే ఏర్పాటు చేయాలంటూ అప్పట్లో చంద్రబాబునాయుడు ఎన్నికల సంఘానికి, చీఫ్ సెక్రటరీకి పలుమార్లు లేఖలు రాశారు. బహిరంగంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏప్రిల్ లో అందరూ సచివాలయాలకు వచ్చి తీసుకోవాలని నిర్ణయించింది. అప్పటికి విపరీతంగా ఉన్న ఎండల దెబ్బకు పెన్షను కోసం వచ్చిన అనేక మంది వృద్ధులు అసువులు బాశారు. సచివాలయాల వద్ద ఎండలకు బాధలపడే వృద్ధులకు కనీసం తాగునీటి ఏర్పాట్లు కూడా సక్రమంగా చేయకుండా ప్రభుత్వం వారిని వేధించింది. పదుల సంఖ్యలో మరణాలు జరిగాక.. మే నెలలో పెన్షన్లు బ్యాంకు ఖాతాల్లో వేశారు. అప్పటికీ కొన్ని మరణాలు జరిగాయి. జూన్ లో కూడా బ్యాంకు ఖాతాల్లోనే వేశారు. ఈ మరణాలన్నీ చంద్రబాబు పాపం అని ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. ఒకవైపు గ్రామ, సచివాలయ ఉద్యోగుల ద్వారా చాలా సులభంగా ఒకటిరెండురోజుల్లో ఇంటివద్దనే పెన్షన్లు ఇవ్వవచ్చునని… చంద్రబాబు లేఖల రూపంలో మొత్తుకుంటున్నప్పటికీ సీఎస్ జవహర్ రెడ్డి పట్టించుకోలేదు. అది సాధ్యం కాదని అన్నారు.

ఇప్పుడు ప్రభుత్వం మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ వారు బలవంతంగా చేయించిన రాజీనామాల పుణ్యమాని వాలంటీరు వ్యవస్థ గందరగోళంగా ఉంది. దాదాపు 70 వేల మంది రాజీనామాలు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జులై 1 వ తేదీన సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఒకే రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తిచేయాలని, ఏవైనా మిస్సయితే రెండో రోజు పూర్తిచేయాలని ఆదేశించారు. ఏప్రిల్ నుంచి అరియర్స్ కలిపి నిన్నటిదాకా మూడు వేలు అందుకున్న వారికి జులైలో 7వేలు ఇవ్వనున్నారు. గత మూడునెలలుగా సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇవ్వకుండా, వృద్ధుల్ని బలితీసుకోవడం అన్నది కేవలం జగన్ సర్కారు కుట్రగా ఇప్పుడు నిరూపణ అవుతోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories