జగన్ అజ్ఞానాన్ని ఉతికి ఆరేసిన పయ్యావుల!

151 మంది సభ్యులున్న పార్టీకి నాయకత్వం వహించి, ఏదో మధ్యలోని 5 రాలిపోయినట్టుగా 11 సీట్లతో మిగిలిన పార్టీతో శాసనసభలో కూర్చోవాలంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా సిగ్గుగా తోస్తున్నట్లుంది. అందుకే ఆయన ఏదో ఒకరీతిగా సభకు రావడం ఎగ్గొట్టాలని, ఆచరణ సాధ్యం కాని గొంతెమ్మ కోరికలతో శాసనసభాపతికి ఒక లేఖ రాశారు. శాసనసభలో ప్రజల సమస్యలను ప్రస్తావించాలంటే.. ప్రతిపక్ష హోదా ఉంటే తప్ప సాధ్యం కాదని తనకు ఆ హోదా ఇవ్వాలని, అందుకోసం పది శాతం సీట్లు గెలిచి ఉండాలనే నిబంధన రూల్ బుక్ లో ఎక్కడా లేదని ఆయన పేర్కొన్నారు. ఏదేదో పాత ఉదాహరణలు కూడా కోట్ చేశారు. ఈ లేఖ ద్వారా.. శాసనసభా పతిని ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ చేయడానికి జగన్ ప్రయత్నించారు. హోదా ఇవ్వకపోతే స్పీకరు మీద నిందలు వేస్తూ అయిదేళ్లూ సభకు వెళ్లకుండగా గడపవచ్చునని ఆశపడ్డారు. అయితే.. రూల్సులో ఎక్కడా లేదంటూ.. ఆయన కోట్ చేసిన ఉదాహరణల విషయంలో అసలు బండారాన్ని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విడమరచి చెప్పారు. జగన్ ఆ లేఖలో ఏ జ్ఞానాన్ని ప్రదర్శించడం ద్వారా.. మేధావి బిల్డప్ ఇచ్చారో ఆ అంశాల విషయంలో జగన్ అజ్ఞానాన్ని చాలా బాగా ఎండగట్టారు పయ్యావుల.

పార్లమెంటులో 30 సీట్లు గెలిచిన తెలుగుదేశానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. అయితే అప్పట్లో తెలుగుదేశం ఎంపీ పర్వతనేని ఉపేంద్రకు తెదేపా ఫ్లోర్ లీడర్ హోదా ఇచ్చారే తప్ప.. ప్రతిపక్ష హోదా కానేకాదని పయ్యావుల వివరణ ఇచ్చారు. 

1994 లో ఏపీ శాసనసభలో కాంగ్రెస్ 10 శాతం కంటె తక్కువ సీట్లు గెలిచినప్పటికీ.. ప్రధాన ప్రతిపక్షహోదా ఇచ్చారనేది, ఆ హోదాలో పి జనార్దన  రెడ్డి ఉన్నారనేది  జగన్ క్లెయిం. అయితే.. 1994 అసలు కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు పీజేఆర్ కానేకాదని,  ఆయన కేవలం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాత్రమేనని పయ్యావుల చరిత్రను గుర్తుచేస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా విజయభాస్కరరెడ్డి ఉండేవారన్నారు. ఆయనకు కూడా ఫ్లోర్ లీడర్ హోదా దక్కిందే తప్ప.. ప్రధానప్రతిపక్ష హోదా కాదని విశదీకరించారు. తాను చెప్పిన విషయాలన్నీ శాసనసభల రికార్డుల్లోనే ఉన్నాయంటూ పయ్యావుల చెప్పడం గమనార్హం. జగన్ వైసీపీకి ఫ్లోర్ లీడర్ అవుతారే తప్ప, ప్రతిపక్ష నాయకుడు కాలేరని అన్నారు. జగన్ కు ఆత్మీయుడు కేసీఆర్ కూడా గతంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. 

జగన్.. తాను లేఖలో ఏదో తోచినట్టుగా రాసేసి.. బురద చల్లేస్తే వారే కడుక్కుంటారు అన్నచందంగా వ్యవహరించారు. కానీ.. మొత్తానికి పయ్యావుల పాయింట్ బై పాయింట్ చెప్పడంతో.. జగన్ పరువు మరింతగా దిగజారిపోయింది. ఆయన అజ్ఞానం మొత్తం బయటపడిపోయింది. 

Related Posts

Comments

spot_img

Recent Stories