వామ్మో..ఆయన మళ్లీ వచ్చాడు..ఆ భయాన్ని మళ్లీ తెచ్చాడు!

కమల్‌ హాసన్‌ తాజాగా నటించిన సినిమా భారతీయుడు 2 ట్రైలర్‌ వచ్చేసింది. కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌ గా తెరకెక్కించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్‌ తో నిర్మాతలు తీర్చిదిద్దారు. ఈ సినిమాలో సిద్దార్ధ్‌, రకుల్‌ ప్రీత్ , ప్రియా భవాని శంకర్‌, ఎస్‌జే సూర్య, బాబీ సింహ, సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాను జులై 12 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్‌, గింప్ల్స్‌ , పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో భారతీయుడు 2 సినిమాకి మంచి హైప్‌ వచ్చేలా సినిమా ట్రైలర్ ని మూవీ మేకర్స్‌ విడుదల చేశారు.

ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఒక ఎత్తు..ఇక మీదుట ఒక ఎత్తు అనేలా సినిమా ట్రైలర్‌ ని కట్‌ చేశారు. ముందు భాగంలో సేనాపతిని మళ్లీ ఎందుకు వెనక్కి తీసుకు రావాల్సి వచ్చింది అనేదాన్ని ఆసక్తికరంగా చూపించారు. యాంగ్రీ యంగ్‌ మ్యాన్ గా సిద్దార్థ్‌ అతని ప్రియురాలిగా ప్రియా భవాని శంకర్‌ కనిపిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories