టాలీవుడ్ భల్లాలదేవుడు రానా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రానా నాయుడు వెబ్ సిరీస్ చేసిన తరువాత రానా చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటికే ఆయన తన నెక్ట్స్ సినిమాల గురించి చెప్పినా, అవి పట్టాలెక్కకపోవడంతో అభిమానులు ఒకింత నిరాశ చెందుతున్నారు.
దర్శకుడు తేజ దర్శకత్వంలో ‘రాక్షస రాజు’ అనే సినిమాను ప్రకటించిన రానా, ఆ సినిమా షూటింగ్ ను ఇంకా మొదలు పెట్టలేదు. గతంలో దర్శకుడు గుణశేఖర్ తో కలిసి ‘హిరణ్యకశ్యప’ అనే సినిమాని ప్రకటించారు. ఈ సినిమా కూడా ఇంకా హోల్డ్ లోనే ఉంది. దీంతో ఇప్పుడు ఓ కొత్త దర్శకుడితో తన తరువాత సినిమాని స్టార్ట్ చేసేందుకు రానా రెడీగా ఉన్నాడంట.
కాగా, ఈ సినిమాలో ‘కేజీఎఫ్’ హీరోయిన్ శ్రీనిధిని తీసుకునేందుకు చిత్ర బృందం భావిస్తుందంట. ఈ కాంబోలో తెలుగు ఆడియెన్స్ కు రిఫ్రెషింగ్ గా కనిపిస్తుందని వారు అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.