నాకు కూడా ఆ కోరికలు ఉంటాయిగా…అందుకే రెండో పెళ్లి చేసుకుంటాను!

వెయ్యి అబద్దాలు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఎస్తేర్ అందరికీ సుపరిచితమే. ఆ తర్వాత సునీల్ హీరోగా వచ్చిన ‘భీమవరం బుల్లోడు’ సినిమాలో నటించి మెప్పించింది. ఈ మూవీలో తన నటనకు మంచి మార్కులు పడినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. కానీ ఇటీవల వచ్చిన 69 సంస్కార్ కాలనీ, రెక్కీ వంటి రొమాంటిక్ వెబ్ సీరీస్‌లలో నటించి అలరించింది.

రొమాన్స్ అనే సరికొత్త అర్దాన్ని చెప్తూ సినిమా లుక్‌నే మార్చేసింది. దీంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ‘ది వేకెంట్ హౌస్’ అనే సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంది. దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా ఎస్తేర్ నే చేపడుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్‌ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె .. మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మగవాళ్లనే అంటారు. వాళ్లు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా ఆఫర్ చేయడం పరిశ్రమలో ఉంది. అయితే అవకాశాల కోసం క్యారెక్టర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ కారణంగానే గతంలో కొన్ని సినిమాలు చేజారాయి. పైగా మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటే ట్రోల్ చేయడమే కాక ప్రాస్టిట్యూట్ అనే ముద్ర కూడా వేస్తారు. ఆడవాళ్లకి కోరికలు ఉంటాయి. అలా కోరికలు ఉండటాన్ని ప్రస్తుతం సమాజం తప్పులా చూస్తుంది.

అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆడవాళ్లకి కూడా ఒక జీవితం ఉంటుంది. వారికి కూడా ఎమోషన్స్ ఉంటాయి… అంటూ చెప్పుకొచ్చారు ఎస్తేర్. అదేవిధంగా మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని యాంకర్ అడగ్గా.. దానికి నాకు ఒంటరిగా ఉండాలని లేదు. రెండో పెళ్లి చేసుకుంటానని పేర్కొంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories