అదిరిపోయిన ‘ఫియర్ సాంగ్‌’ లిరికల్ వీడియో…గూస్‌బంప్స్ అంతే!

మ్యాన్‌ ఆఫ్ మాసెస్‌, టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఈ సినిమా భారీ అంచనాలతో రూపొందుతుంది. ఈ చిత్రానికి కొరటాల శివ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం  రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ‘దేవర’ ఫియర్ సాంగ్ మిలియన్లకు పైగా వ్యూస్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుండగా.. తాజాగా మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు

తాజాగా ‘ఫియర్ సాంగ్’ లిరికల్ వీడియోను విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లో కూడా ఈ వీడియో విడుదలైంది. అదిరిపోయే యాక్షన్ విజువల్స్ తో సాగిన ఈ లిరికల్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా.. సైఫ్‌ అలీఖాన్‌, ప్రకాశ్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ \ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Related Posts

Comments

spot_img

Recent Stories