చాలు ఈ మాత్రం ఉంటే చాలు!

సినిమా తీయడం అంతా ఒక ఎత్తైతే,…దాన్ని ప్రేక్షకుల్లో చేర్చేందుకు కష్టపడే తీరు మరో ఎత్తు. అందుకే సినిమా బడ్జెట్ అనుకున్నప్పుడే ప్రమోషన్స్‌కు ఎంత అనే.. లెక్కలు వేసుకుంటారు నిర్మాతలు. ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాకు ప్రమోషన్స్ అంటే.. ఆ లెక్క కాస్త గట్టిగానే ఉంటుంది మరి. కానీ కల్కి విషయంలో మాత్రం అనుకున్నంత ప్రమోషన్స్ జరగడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు.

 కల్కి అనే కాదు.. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉందని పేర్కొంటున్నారు. కాకపోతే సలార్ సినిమాకు మాత్రం ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబో వల్ల సాలిడ్ హైప్ వచ్చింది. చెప్పాలంటే.. మూవీ మేకర్స్ కంటే, అభిమానులే ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేశారు. ఇదే కాదు గత సినిమాలకు కూడా బాహుబలి క్రేజ్‌తో ఓవర్ హైప్ వచ్చింది.

అదే ఫస్ట్ డే ఓపెనింగ్స్‌కు మంచిగా కలిసొచ్చింది. కానీ కల్కికి మాత్రం అలా జరగడం లేదనే మాట గట్టిగా వినిపిస్తోంది. సినిమా బాగుంటే కలెక్షన్స్ పెరుగుతాయేమో గానీ, భారీ ఓపెనింగ్స్ రావడం కష్టమని కొందరు అంటున్నారు. సినిమా విడుదలకు వారం రోజులే ఉంది. ఈ టైంలో సోషల్ మీడియా కల్కి ఫీవర్‌తో అల్లాడిపోవాల్సింది.. కానీ ఆ స్థాయి ప్రమోషన్స్ చేయడం లేదని ఫ్యాన్స్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. ఓ విధంగా చెప్పాలంటే.. కల్కికి ఇదే చాలా ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే.. ప్రభాస్ సినిమా అంటే, ఆటోమేటిక్‌గా భారీఅంచనాలు ఉంటాయి. గతంలో బాహుబలి తరువాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు ఇదే జరిగింది. ఈ సినిమాల పై హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్లకు వెళ్లారు. కానీ తీరా థియేటర్లకు వెళ్లాక తాము ఊహించిన స్థాయిలో సినిమా లేదని నిరాశ పడ్డారు. అందుకే.. ఇప్పుడు కల్కి పై ఓవర్ హైప్ లేకపోవడమే ఓ రకంగా బెటర్ అని అనిపిస్తోంది. మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమాకు వెళ్లిన ప్రేక్షకుడికి.. సినిమా అద్భుతంగా అనిపించిందంటే చాలు.. మౌత్ టాక్ ద్వారానే థియేటర్లకు క్యూలు కట్టేస్తారు. ప్రమోషన్స్ లేకపోయినా… మౌత్ టాక్ గట్టిగా వినపడితే వసూళ్ల వర్షం అలా కురుస్తుంది అంతే. మేక‌ర్స్ కూడా ఇదే స్ట్రాటెజీ ఫాలో అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది. పైగా కల్కి సెన్సార్ టాక్ కూడా సూపర్‌ ఉంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories