పుష్ప సినిమాని రిజెక్ట్‌ చేశారా..అదిరిపోయే ఆన్సర్‌ ఇచ్చిన విజయ్‌ సేతుపతి!

కోలీవుడ్ స్టార్ హీరో , మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ‘మహారాజ’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాకి మంచి ఆదరణ లభించడంతో చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్లో థాంక్యూ మీట్ జరిపారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన రిపోర్టర్లు విజయ్ సేతుపతిని రకరకాల ప్రశ్నలు అడగ్గా.. వాటికి ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ‘పుష్ప 2’ ) లో నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేశారని వార్తలొచ్చాయి… అది నిజమేనా? అని ఓ విలేకరి అడగగా అందుకు సేతుపతి బదులిస్తూ..” నేను రిజెక్ట్ చేయలేదు. జీవితంలో అన్ని సార్లు నిజం చెప్పకూడదు. కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పడం మంచిది అంటూ సరదాగా నవ్వేశారు.

ఇదే కార్యక్రమంలో మరో విలేకరి ‘మీరు నేరుగా తెలుగులో మళ్లీ ఎప్పుడు నటిస్తారు?’ అని అడిగితే..” తెలుగు చిత్రాల్లో నటించేందుకు నేను ప్రయత్నిస్తున్నా. కానీ మంచి కథ దొరకట్లేదు. దానికి తగినట్లుగా తెలుగులో అవకాశాలే నాకు ఎవరూ ఇవ్వట్లేదు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ సేతుపతి కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories