ఈ సినిమాకోసం రోజువారీ రెమ్యూనరేషన్‌..ఫాహద్‌ ఫాజిల్‌ వింత కండీషన్‌!

డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో ఫాహద్‌ ఫాజిల్‌. పుష్ప సినిమాతో డైరెక్ట్‌ తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చాడు.సినిమాలో భన్వర్ సింగ్ షికావత్ పాత్రలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ‘పుష్ప’ కంటే ముందు మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఉన్న ఫాహద్.. పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం వరుసగా మలయాళ సినిమాలు చేస్తూనే ఇతర భాషల్లోనూ ఫుల్‌ బిజీగా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప 2 లో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే ఫాహాద్ ఫాజిల్ తాజాగా రెమ్యునరేషన్ విషయంలో పుష్ప నిర్మాతలకు కొన్ని వింత కండీషన్స్ పెట్టినట్లు ఫిలిం సర్కిల్స్ లో ఓ టాక్ వినిపిస్తుంది. దాని ప్రకారం..ఫాహాద్ ఫాజిల్ ‘పుష్ప 2’లో నటిస్తున్నందుకు గానూ రెమ్యునరేషన్ రోజువారీగా తీసుకుంటున్నారంట.

.రోజుకి రూ.12 లక్షల‍్ని రెమ్యునరేషన్‌గా ఫిక్స్ చేసిన ఫాహాద్.. ఒకవేళ తాను హైదరాబాద్ వచ్చిన తర్వాత షూటింగ్ రద్దయితే మాత్రం అదనంగా మరో రూ.2 లక్షలు అంటే మొత్తంగా రోజుకి రూ.14 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడంట. ఈ కండీషన్స్ గురించి తెలిసిన నెటిజన్స్ ఫాహాద్ ప్లానింగ్ మాములుగా లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories