భైరవ అంథమ్‌ ప్రొమో వచ్చేసింది…చూశారా!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాల్లో మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా కల్కి 2898 ఏడీ. ఈ సినిమాని నాగ్‌ అశ్విన్‌ హాలీవుడ్‌ రేంజ్‌ లో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా లో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ప్రభాస్ సరసన బాలీవుడ్‌ భామలు దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

 సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. తాజాగా భైరవ ఆంథమ్ పేరుతో ఒక సాంగ్ ప్రోమో ని విడుదల చేసింది. ఫుల్ సాంగ్ ని ఆదివారం విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే ఈ పాటను ప్రముఖ సింగర్ డిల్జిత్ దోసఙ్హ్ పాడారు. ప్రోమో విడుదలైన క్షణాల్లోనే భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది.. ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories