ఆ నరుకుడేంది స్వామి…అదరగొట్టిన కన్నప్ప టీజర్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’.  ఈ సినిమా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో  అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.  గత ఏడాది ఈ చిత్ర షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.

 తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేశారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక కన్నప్ప సినిమా ప్రమోషన్స్ భారీగానే ప్లాన్‌ చేస్తున్నారు. ఆల్రెడీ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప సినిమా టీజర్ ప్లే చేశారు.

తాజాగా కన్నప్ప సినిమా టీజర్‌ విడుదల చేశారు.  అయితే అధికారంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వస్తుంది.  ఈ టీజర్ లో మంచు విష్ణు కత్తి పట్టుకొని నరుకుతున్నట్లు కనిపిస్తుంది . అలాగే శివుడు తపస్సు చేస్తున్నట్లు ఉంది. అందులోని ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో శివుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్నది మాత్రం ఇంకా క్లారిటి రాలేదు కానీ అక్షయ్ కుమార్ ఉండొచ్చని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories