5 సంతకాలతో వారి నోర్లకు తాళాలు!

‘‘చంద్రబాబునాయుడు చెప్పిన మాట మీద నిలబడరు. ఆయనను ప్రజలు నమ్మరు. ఆయన ఎన్నికల్లో హామీలు ఇస్తారే తప్ప.. గెలిస్తే వాటిని ఆచరించడం గురించి మరచిపోతారు..’’ ఇలా ఎన్నెన్ని కారు కూతలు కూశారో కదా? చంద్రబాబు నాయుడును బద్నాం చేయడానికి, మాజీ ముఖ్యమంత్రి జగన్.. ఎన్నికల ప్రచారంలో రకరకాల విషప్రచారాలు చేశారు. చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకోసం ఎలాంటి వరాలనైతే కురిపించారరో.. వాటికి దీటుగా ఇంకో మాట చెప్పడానికి ధైర్యం లేక.. అలాగని చంద్రబాబునాయుడు వరాలు ప్రజలను ఆకర్షిస్తే తన భవిష్యత్తు అగమ్యగోచరం అయిపోతుందేమోననే భయంతో.. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన తైనాతీలు రకరకాల మాటలు అన్నారు. వారందరి నోర్లకు తాళాలు వేస్తూ చంద్రబాబునాయుడు తాను అధికారం చేపట్టిన వెంటనే తొలి అయిదు సంతకాలను.. అయిదు అద్భుతమైన అంశాలకు సంబంధించిన ఫైళ్లపై చేయడం విశేషం.

తాను అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలు మీదనే చేస్తానంటూ చంద్రబాబునాయుడు ప్రచార సమయంలో ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ రావడానికి కొన్ని రోజుల ముందు డీఎస్సీ ప్రకటన చేయగా, అదికాస్తా కోడ్ పుణ్యమాని ఆగిపోయింది. జగన్ అప్పట్లో ఆరువేల పోస్టులతో డీఎస్సీ ప్రకటన చేయగా.. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే.. 16347 పోస్టలతో మెగా డీఎస్సీఫైలుపై సంతకం చేశారు. అలాగే ప్రచారంలో హామీ ఇచ్చినట్టే ప్రజల్లో భయాలను తొలగించడం లక్ష్యంగా లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రెండో సంతకం చేశారు.

వృద్ధాప్య పింఛన్లను నాలుగువేలకు పెంచుతానని చంద్రబాబు చెప్పగా, తన ఓటు బ్యాంకు గల్లంతవుతుందని జగన్ దానిపై ఎంతటి దుష్ప్రచారం చేశారో అందరికీ తెలుసు. ఆ ఫైలుమీదనే మూడో సంతకం చేసిన చంద్రబాబు.. జులై నెలలో ఏప్రిల్ నుంచి అరియర్స్ మూడు వేలకు, కొత్తగా పెంచిన పెన్షను నాలుగువేలు కలిపి ఏడువేలు అందజేయాల్సిందిగా ఆదేశించారు.

పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం గురించి చంద్రబాబు నాలుగో సంతకం చేయడం విశేషం. అలాగే నైపుణ్య గణనపై అయిదో సంతకం చేశారు.
ఈ సంతకాలతో.. తాను మాట నిలబెట్టుకోను అని కారుకూతలు కూసేవారి నోర్లను చంద్రబాబునాయుడు మూయించినట్లుగా అయిందని ప్రజలు సంతోషిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories