కమల్‌ మూవీ ‘థగ్ లైఫ్’ షూటింగ్ లో ప్రమాదం..స్టార్‌ హీరోకి గాయాలు!

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ విక్రమ్‌ సినిమా తరువాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాల్లో థగ్‌ లైఫ్ కూడా ఒకటి. తమిళ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూవీలోని స్టార్ నటుడు జోజు జార్ట్‌ గాయపడినట్లు సమాచారం.

థగ్ లైఫ్ మూవీకి సంబంధించి ప్రస్తుతం పాండిచ్చేరి ఎయిర్‌పోర్టులో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.. ఇందులో భాగంగా హెలికాప్టర్‌ జంపింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా.. నటుడు జోజు జార్జ్‌ ఎడమకాలికి గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. ఇందులో భాగంగా డాక్టర్లు జోజు జార్జ్‌ కాలికి కట్టు కట్టారు.

స్టిక్‌ సాయంతో నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ ఒకటి నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories