డకాయిట్‌ షూటింగ్‌ లో శ్రుతి హాసన్‌!

అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ జంటగా నటిస్తున్న సినిమా డకాయిట్‌. ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి షానీల్‌ డియో డైరెక్షన్‌ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. తాజాగా డకాయిట్ సినిమాకు సంబందించిన ఓ అప్డేట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా శ్రుతి హాసన్ డకాయిట్ షూటింగ్‌లో అడుగుపెట్టారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. భారీ యాక్షన్ షెడ్యూల్‌కు సంబంధించి సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలు, లీడ్‌ రోల్స్‌ తో కూడిన యాక్షన్ పార్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. తాను డకాయిట్ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు అడివి శేష్‌తో దిగిన సెల్ఫీని శ్రుతి హాసన్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

ఇద్దరు మాజీ ప్రేమికుల నేపథ్యంలో సాగే గ్రిప్పింగ్ స్టోరీగా డకాయిట్ తెరకెక్కుతుంది. క్షణం, గూడాచారి సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా పనిచేసిన షానీల్ డియో.. డకాయిట్ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. షానీల్ డియో పాటు అడివి శేష్ ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్ ప్లే కూడా ఇచ్చాడు. శేష్, శ్రుతి జంటగా నటించిన తొలి చిత్రం ఇది. 

Related Posts

Comments

spot_img

Recent Stories