పుష్ప 2 షూటింగ్‌ అప్డేట్‌ వైరల్‌!

జాతీయ నటుడు అల్లు అర్జున్‌ తాజాగా నటిస్తున్న సినిమా పుష్ప 2. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా పుష్ప సినిమాకు సీక్వెల్‌ గా తెరకెక్కుతుంది. పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌ గా ఈ సినిమా వస్తుండడంతో అభిమానులు ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా నుండి మేకర్స్ రెండు పాటలు విడుదల చేయగా ఈ రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయి.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగానే ఈ సినిమా విడుదలను మరో నెల రోజులు వాయిదా వేయనున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ జూన్ 13 నుంచి రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను మేకర్స్ గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories