అఖండ 2 స్పెషల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేది అప్పుడే!

నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమాతో ఎంతటి విజయాన్ని అందుకున్నారో తెలిసిన విషయమే. ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా “NBK109 “అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్‌ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

బాలయ్య మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే జూన్ 10 బాలయ్య బర్త్ డే.. ఈ సందర్భంగా ఈ చిత్రం నుండి స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు నిర్మాత నాగ వంశీ తెలిపారు.అయితే బాలయ్య బర్త్ డే రోజు మరో భారీ చిత్రం అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు సమాచారం.బాలయ్య,బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం “అఖండ” ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడు బాలయ్య బర్త్ డే సందర్భంగా “అఖండ 2 ” సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం.ఈ సినిమా స్క్రిప్ట్ కూడా ఇప్పటికే  పూర్తి అయింది.దీంతో ఈ  సినిమా అనౌన్స్మెంట్ కోసం   అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు

Related Posts

Comments

spot_img

Recent Stories