ఆ స్టార్‌ హీరో సినిమాకి రెడీ అయిన శంకర్‌!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ “శంకర్” ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు.గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో దర్శకుడు శంకర్ “గేమ్ ఛేంజర్”.అనే సినిమా ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందుగా దర్శకుడు శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు సీక్వెల్ గా “ఇండియన్ 2 ” సినిమాను మొదలు పెట్టారు.

ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది.దీంతో రాంచరణ్ తో సినిమా మొదలు పెట్టారు.అయితే కొన్నాళ్ళకు ఇండియన్ 2 సినిమాకు వచ్చిన ఇబ్బందులు తీరిపోవడంతో శంకర్ మళ్లీ తిరిగి రాంచరణ్ సినిమాకు బ్రేక్ ఇచ్చి ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసాడు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది.దీంతో శంకర్ రాంచరణ్ సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టారు.

 మరో 10 రోజుల్లో గేమ్ ఛేంజెర్ షూటింగ్ పూర్తి అవుతున్నట్లు సమాచారం. దీంతో శంకర్ తరువాత ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తాడా అని అందరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే దర్శకుడు శంకర్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో తన తరువాత సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది.ప్రస్తుతం అజిత్ “గుడ్ బ్యాడ్ అగ్లీ”అనే సినిమా చేస్తున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories