షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న గేమ్‌ ఛేంజర్‌!

గ్లోబల్‌ స్టార్‌ రాంచరణ్‌ నటిస్తున్న తాజా చిత్రం గేమ్‌ ఛేంజర్‌.  ఈ సినిమాని స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది. క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా ఇంకా పూర్తి కాలేదు.దానికి కారణం కూడా లేకపోలేదు…దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఇండియన్ 2 సినిమా విడుదలకు సిద్ధం కావడంతో దర్శకుడు శంకర్ తన ఫోకస్ అంతా కూడా “గేమ్ ఛేంజర్ ” షూటింగ్ పై పెట్టారంట.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.మరో పది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కు స్వస్తి చెప్పనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు.అక్టోబర్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కూతురు ప్రకటించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories