అవును నేను రిలేషన్‌ లో ఉన్నాను..ఎవరితో అంటే!

టాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి శెట్టి మనమే సినిమా ప్రమోషన్స్‌ లో ప్రస్తుతం బిజీబిజీగా ఉంది. వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ ఖాళీ లేకుండా ఉంది. చాలా కాలం తరువాత కృతి మళ్లీఅభిమానుల ముందుకు వస్తుండడంతో ఆమెకు రకరకాల చిలిపి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో కృతి కూడా చాలా తెలివిగా వాటికి సమాధానాలిస్తుంది.

 ‘మీరు సింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నేను సింగిల్‌ కాదు. రిలేషన్‌లోనే ఉన్నా’ అని సూటిగా సమాధానమిచ్చేసింది.‘ఎవరితో?’ అనడిగితే.. ‘నా పనితో.. నా పనితో రిలేషన్‌లో ఉన్నా’ అంటూ నవ్వులు పూయించేసింది కృతి. కాబోయేవాడు ఎలావుండాలి? అనడిగితే.. ‘మంచివాడై ఉండాలి. నిజాయితీపరుడై ఉండాలి. సాటివారిపై దయ కలిగి ఉండాలి’ అంటూ అందంగా చెప్పుకొచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories