చెర్రీ కూతురికి కల్కి టీం అదిరిపోయే గిఫ్ట్‌!

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ ఎంతో వేడుక గా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బుజ్జి ని బాగా హైలైట్ చేస్తూ చిత్ర యూనిట్ బాగా ప్రమోట్ చేస్తుంది.

ఈ సినిమాలో బుజ్జి పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే తెలిపారు. బుజ్జి కార్ ను మేకర్స్ దేశంలో పలు ప్రధాన నగరాల్లో తిప్పుతూ కల్కి మూవీ ని జోరుగా ప్రచారం చేస్తున్నారు . అలాగే రీసెంట్ గా మేకర్స్ బుజ్జి అండ్ భైరవ అనే యానిమేషన్ వెబ్ సిరీస్ ను కూడా విడుదల చేసారు. ప్రేక్షకులకు కల్కి చిత్ర ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు ఈ యానిమేటెడ్ వెబ్ సిరీస్ ను తీసుకొచ్చినట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ వివరించారు.

ఇదిలా ఉంటే మేకర్స్ బుజ్జి ,భైరవ క్యారెక్టర్స్ తో కల్కి సినిమాపై పిల్లలో కూడా ఆసక్తి పెంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో బుజ్జి బొమ్మలు ,భైరవ స్టిక్కర్స్  టీ షర్ట్స్ ను బాగా సేల్ చేస్తున్నారు .కల్కి టీం ఈ గిఫ్ట్స్ ను సెలెబ్రెటీ పిల్లలకి పంపిస్తుంది.తాజాగా రాంచరణ్ కూతురు క్లీంకారకి ఈ గిఫ్ట్స్ ను కల్కి టీం పంపించింది.

ఆ బహుమతులను ఉపాసన తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఈ స్టోరీలో క్లీంకార సైజు కల్కి కాస్ట్యూమ్ ,బుజ్జి బొమ్మ ,కల్కి స్టిక్కర్స్‌ తో పాటు  ఒక లెటర్ కూడా ఉంది.ప్రస్తుతం ఈ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories