అంతా అయిపోయాక.. ఇప్పుడేందుకమ్మా అంజలి!

గత 2-3 రోజులుగా నందమూరి నటసింహం బాలకృష్ణ సోషల్‌ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నారు. దానికి కారణం…విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్టుగా వెళ్లిన బాలయ్య.. హీరోయిన్ అంజలి పట్ల దురుసుగా ప్రవర్తించడమే. స్టేజ్‌పై అంజలిని బాలయ్య బాబు పక్కకి నెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంజలిని ఆయన కావాలనే నెట్టేశారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే హీరో విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ రియాక్ట్ అవ్వగా.. తాజాగా హీరోయిన్ అంజలి స్వయంగా స్పందించారు బాలకృష్ణతో తనకున్న అనుబంధం గురించి అంజలి ట్విటర్ లో పోస్ట్‌ పెట్టారు. దీంతో ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్‌ పడింది.

‘బాలకృష్ణ గారు హాజరు అవ్వడం వల్లే  గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఎంతో వేడుకగా జరిగింది. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఇద్దరికీ ఒకరి పట్ల మరొకరికి ఎంతో  గౌరవం ఉంది. మేమిద్దరం ఎన్నో ఏళ్లుగా స్నేహంగా ఉంటున్నాం. బాలకృష్ణతో మరోసారి వేదిక పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని అంజలి రాసుకొచ్చారు. అంతేకాకుండా ఈవెంట్‌లో ఇద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు. బాలకృష్ణ తనను తోసిన విషయాన్ని చెప్పకుండా ఇండైరెక్ట్‌గా ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

 ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్స్ మాత్రం వెరైటీగా స్పందిస్తున్నారు. అంతా అయిపోయాక పోస్టు చేయడం బాలేదని, అంజలి తప్పక ఈ పోస్టు పెట్టాల్సి వచ్చిందంటూ కామెంట్లు రాసుకోస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories