అల్లు అర్జున్‌ కు పోటీగా వస్తున్న కీర్తి సురేష్‌!

స్టార్‌ నటి , మహానటి కీర్తి సురేష్‌ నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, సావిత్రిగా అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. గ‌త ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ఈ భామ ప్ర‌స్తుతం తెలుగు సినిమాలకు కొంచెం బ్రేక్‌ ఇచ్చింది. ఈ బ్రేక్‌ లో తమిళంతో పాటు బాలీవుడ్ సినిమాలు చేస్తుంది. ఇప్ప‌టికే హిందీ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్‌తో ఒక సినిమా చేస్తున్న ఈ భామ తాజాగా ‘రఘు తాతా’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాకు సుమన్‌కుమార్‌ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రీసెంట్‌గా టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని అనౌన్స్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం కానుక‌గా ఆగ‌ష్టు 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు. అయితే అదే రోజు తెలుగులో అల్లు అర్జున్ పుష్ప విడుద‌ల కానుంది. దీంతో ఆగ‌ష్ట్ 15న రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.

ఇక ర‌ఘు తాతా టీజ‌ర్ చూస్తే.. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లో క్యాడెట్ శిక్షణ పొందుతున్న కీర్తి సురేష్ పాత్రతో టీజ‌ర్ ప్రారంభమైయ్యింది. అయితే ఎన్‌సీసీ మాస్ట‌ర్ హిందీలో  వారికి శిక్ష‌ణ ఇస్తుండ‌గా.. నాకు హిందీ రాదు త‌మిళంలో చెప్పండి సార్ అంటూ కీర్తి అంటుంది. దీంతో ఈ చిత్రం తమిళ ప్రజలపై హిందీని రుద్దడం చుట్టూ తిరుగుతున్న‌ట్లు అర్థమవుతుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories