తమిళ సీనియర్ నటుడు, బాహుబలి ఫేమ్ కట్టప్ప సత్యరాజ్ భారత ప్రధాని మోదీ బయోపిక్ చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై సత్యరాజ్ రీసెంట్‌గా క్లారిటీ ఇచ్చాడు. మోదీ బయోపిక్‌లో నేను నటించనున్నట్లు వస్తున్న వార్తలు అబద్దమని వివరించాడు.
నా ఐడియాలజీ.. మోదీఐడియాలజీ వేరని.. ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియార్‌ను ఆరాధించే నేను మోదీ బయోపిక్‌లో నటిస్తానని ఎలా అనుకున్నారు అంటూ సత్యరాజ్ చెప్పుకోచ్చాడు. దీంతో ఈ వివాదం ముగిసిపోయింది. అయితే తాజాగా ఓ మూవీ ఈవెంట్‌లో పాల్గోన్న సత్యరాజ్ మోదీ పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
తమిళ నటుడు విజయ్ ఆంటోని తాజాగా హీరోగా నటిస్తున్న సినిమా మలై పిడిక్కత మనితాన్. ఈ సినిమా టీజర్ ఈవెంట్‌లో పాల్గొన్న సత్యరాజ్ మోదీ బయోపిక్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. సత్యరాజ్ మాట్లాడుతూ.. మోదీ పాత్రలో నటించడానికి నన్ను ఎవరూ సంప్రదించలేదు. నిజంను నిజాయితీగా చూపించే నా మిత్రుడు దివంగత దర్శకుడు మణివణ్ణన్ మోదీ బయోపిక్‌కు దర్శకత్వం వహించి ఉంటే నేను ఈ సినిమాలో నటించి ఉండేవాన్ని. కానీ ఇప్పుడు అతను లేడు కాబట్టి ‘వెట్రి మారన్’ కానీ పా.రజిత్ కానీ మరి సెల్వరాజ్ లాంటి దర్శకులు ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తే ఇందులో నటిస్తా అంటూ సత్యరాజ్ చాలా వెటకారంగా సమాధానమిచ్చాడు.