బాలయ్య , అంజలి వివాదం పై స్పందించిన విశ్వక్‌సేన్‌!

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ , ఛల్‌ మోహన్‌ రంగ సినిమా దర్శకుడు కృష్ణ చైతన్య  డైరెక్షన్‌ లో రూపుదిద్దుకుంటున్న సినిమా గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి.  ఈ మూవీలో  నేహా శెట్టి హీరోయిన్ గా చేసింది.అంతేకాకుండా ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ పక్కా మాస్ పాత్రలో కనిపిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ మే 31న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక  నిర్వహించింది. ఈ ఈవెంట్ కు నందమూరి బాలయ్య ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో భాగంగా బాలయ్య స్టేజిపైకి వచ్చారు. ఫోటోలకు పోజులు ఇచ్చే క్రమంలో అంజలిని బాలయ్య పక్కకు జరగమన్నారు. అప్పుడు అంజలి నెమ్మదిగా జరుగుతుంది. దీంతో కోపం వచ్చిన బాలయ్య ఆమెను పక్కకు నెట్టారు.

దీంతో అంజలి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే ఆ విషయాన్నీ నటి అంజలి సరదాగా తీసుకోని తరువాత నవ్వేస్తుంది.కానీ ఈ విషయం గురించి వివాదం చెలరేగింది. బాలయ్యకు మహిళలకి గౌరవం ఇవ్వడం తెలీదని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ఈ విషయంపై నటుడు విశ్వక్ సేన్ స్పందించారు..ఈవెంట్ లో జరిగింది వేరు సోషల్ మీడియాలో చూపించేది వేరు…దానిని ముందు వెనుక కట్ చేసి కావాలనే వైరల్ చేస్తున్నారు. బాలయ్య బాబు ఎప్పుడు అందరితో సరదాగా ఉంటారు. ఆయనపై ట్రోల్స్ ఆపండి అని విశ్వక్ తెలిపారు.

Related Posts

Comments

spot_img

Recent Stories