గేమ్ ఛేంజర్‌ లో అలాంటి పాత్రే నాది అంటున్న అంజలి!

తెలుగమ్మాయి హీరోయిన్‌ అంజలి చాలా కాలం తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. కొద్ది రోజుల క్రితం గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాకుండా ఈ నెల 31 న మరోసారి గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న అంజలి ‘గేమ్ చేంజెర్’ సినిమా గురించి మాట్లాడింది. గేమ్ చేంజర్ సినిమా గురించి ఆమె ప్రస్తుతానికి ఎక్కువగా మాట్లాడలేనని కామెంట్ చేస్తూనే.. కొన్ని విషయాలను మాత్రం కన్ఫామ్ చేసింది.అదేమిటంటే., తనది గేమ్ చేంజెర్ సినిమాలో ఎలాంటి కీలక పాత్ర కాదని., కేవలం ఒక హీరోయిన్ పాత్ర మాత్రమే అని చెప్పుకొచ్చింది.

తనకు ఫ్లాష్ బ్యాక్ లోనేని ఎక్కువ కథ ఉంటుందని., ఒక అద్భుతమైన సాంగ్ కూడా తన మీద కంపోజ్ చేశారని ఆమె తెలిపింది. ఇక సినిమా గురించి తన కంటే దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు గాని వెల్లడిస్తేనే కరెక్ట్ గా ఉంటుందని పేర్కొంది. సినిమా గురించి బయట మాట్లాడవద్దని మాకు  సూచనలు ఉన్నాయని అంజలి వివరించింది.

Related Posts

Comments

spot_img

Recent Stories