తారక్‌ తో జత కట్టనున్న రష్మిక!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ,మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర “. దర్శకుడు కొరటాల ఈ సినిమాను భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది.

అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి “ఫియర్ సాంగ్”ను విడుదల చేసారు. ఈ సాంగ్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చింది. ఇప్పటికే 50 మిలియన్ వ్యూస్ సాధించి నెట్టింట టాప్ ట్రెండ్ లో ఉంది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ పుట్టినరోజు తన మరో మూవీ అప్డేట్ కూడా వచ్చింది.ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.వీరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ షూటింగ్ ఆగస్టు నుంచి మొదలు కానున్నదని  తెలిపారు.ఈ సినిమాకు “డ్రాగెన్” అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించనుందని టాక్‌.రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వుంది.తాజాగా ఎన్టీఆర్ సినిమాతో రష్మిక మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories