తారక్ సరసన ఆ బాలీవుడ్ ముద్దుగుమ్మ!

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ఆ సినిమాల్లో మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా దేవర.  ఈ సినిమాని డైరెక్టర్‌ కొరటాల శివ  బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది.  అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా చేయనున్నట్లు సమాచారం.

ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన “ఫియర్ సాంగ్” అభిమానులకు  విపరీతంగా నచ్చింది. ఈ సాంగ్ రికార్డు వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు తన మరో మూవీ అప్డేట్ కూడా వచ్చింది. ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ మాస్‌ మూవీ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. వీరి కాంబోలో వస్తున్న మూవీ చిత్రీకరణ ఆగస్టు నుంచి మొదలు కానున్నదని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు “డ్రాగన్” అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. 

Related Posts

Comments

spot_img

Recent Stories