శ్రీవల్లి సాంగ్‌ పై రష్మిక స్పెషల్‌ ట్వీట్‌

జాతీయ నటుడు అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్, లెక్కల మాస్టర్‌ సుకుమార్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమా  పుష్ప సినిమాకు  సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుడల అయిన పోస్టర్స్ ,గ్లింప్స్‌ ,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

 తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగల్ ను విడుదల చేసారు.’పుష్ప పుష్ప’ అంటూ సాగె ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ విడుదల అయిన కొద్దీ గంటలకే రికార్డు వ్యూస్ తో రికార్డులు బద్దలుకొట్టింది.ఈ సాంగ్ కు రాక్ స్టార్ దేవిశ్రీ అందించిన మ్యూజిక్ , అల్లుఅర్జున్ స్టెప్స్ హైలైట్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్ పై చిత్ర బృందం స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. శ్రీవల్లి అనౌన్స్మెంట్ వీడియో వచ్చేస్తుంది, రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ ప్రత్యేక వీడియో ఉంటుందని సినిమా బృందం ప్రకటించింది

తాజాగా పుష్ప 2 మూవీ సెకండ్ సింగిల్ పై రష్మిక ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. సాంగ్ షూటింగ్ మొత్తం ఎంతో అద్భుతంగా సాగిందని, ఈ సెకండ్ సింగిల్‌ తప్పకుండా అందరిని అలరిస్తుందని..సో ఎగ్జైటెడ్ అంటూ రష్మిక ట్వీట్ లో పేర్కొంది.

Related Posts

Comments

spot_img

Recent Stories