కల్కి ఈవెంట్‌ ను గ్రాండ్‌ గా ప్లాన్‌ చేసిన చిత్ర బృందం!

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ మెయిన్‌ లీడ్‌ లో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌ లో రూపుదిద్దుకుంటున్న సినిమా  కల్కి 2898 ఏడీ.  ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటానీలు హీరోయిన్స్‌ గా చేస్తున్నారు.  ఈ సినిమాలో  యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం లో బుజ్జి రోల్ చాలా కీలకం అని ఇప్పటికే చిత్ర బృందం ప్రత్యేకంగా చెప్పింది.

ఇప్పటికే మేకర్స్ భైరవ తో బుజ్జి కి ఉన్న రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇస్తూ ఒక వీడియో ను రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే బుజ్జి రోల్ కి సంబందించిన ఫస్ట్ లుక్ పై చిత్ర బృందం తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు. హైదరబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మే 22, 2024 న సాయంత్రం 5:00 గంటలకు జరిగే ఈవెంట్ లో బుజ్జి,  భైరవ రోల్స్ ను రివీల్ చేయనున్నారు.

దీని కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories