మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 19 సంవత్సరాల వయసులోనే ప్రేమించిన వ్యక్తి శిరీష్ భరద్వాజ్ తో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకొని మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఆ తరువాత మీడియా ముందుకు వచ్చి తమ ప్రాణహాని గురించి కామెంట్స్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే శిరీష్ భరద్వాజ్ నుంచి విడి పోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆమెకు కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో వివాహం చేశారు.
మెగా అల్లుడు అవ్వడంతో కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా అవ్వాలని చాలా ప్రయత్నాలు చేసి ఒకటి రెండు సినిమాలు చేశారు. ప్రస్తుతానికి కూడా హీరోగా ఉన్నారు. అయితే శ్రీజ, కళ్యాణ్ దేవ్ మధ్య దూరం పెరగడంతో వారు అధికారికంగా విడాకులు తీసుకున్నారో లేదో తెలియదు కానీ చాలా రోజుల నుంచి విడివిడిగానే ఉంటున్నారు. వారి సోషల్ మీడియా అకౌంట్లో ఒకరి ఫోటోలు మరొకరు డిలీట్ చేయడంతో దాదాపుగా వారు విడిపోయారని అంతా ఫిక్స్ అయిపోయారు.
అయితే శ్రీజ తన వివాహ బంధం గురించి గానీ ప్రస్తుతం తన స్టేటస్ గురించి కానీ ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది లేదు. కానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తన భావాలను ఆమె వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని చాలామంది అబ్జర్వ్ చేయలేదు కానీ ఆమె తన భావాలని ఈ విధంగా బయటపెట్టింది అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఆమె పెట్టిన పోస్ట్ ప్రకారం ఎవరైనా తమని తాము ఏ స్థాయిలో అనుకుంటారో ఇతరులు కూడా అదే స్థాయిలో చూస్తారని… అలాగే ఆ స్థాయి వాళ్ళనే కలుసుకుంటారని చెప్పుకొచ్చింది. అంతేకాక ఎన్ని ప్రశ్నలకు అయినా ఇదే ఒక్కటే ఆన్సర్ అంటూ ఆమె పేర్కొనడంతో ఈ పోస్ట్ ఆమె వివాహ జీవితం గురించి పెట్టిందేమో అనే చర్చ జరుగుతోంది.