టాలీవుడ్ అందాల చందమామ కాజల్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించింది. ఇటు తెలుగు తో పాటు తమిళ్,హిందీ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. అయితే కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉన్నప్పుడే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి జంటకు ఓ బాబు కూడా కలగడంతో కాజల్ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.
తాజాగా కాజల్ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ అందుకుంది.ప్రస్తుతం కాజల్ నటించిన లేడి ఓరియెంటెడ్ మూవీ సత్యభామ ఈ నెలాఖరుకు రిలీజ్ అవుతోంది. దీనితో కాజల్ వరుస ప్రమోషన్స్ తో బిజీ గా ఉంది. అయితే పెళ్లి తర్వాత అవకాశాలు రావడంపై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.పెళ్ళైతే హీరోయిన్ల కెరీర్ ముగిసినట్లే అనే అభిప్రాయాన్ని కాజల్ తప్పని భావించారు.
కాజల్ మాట్లాడుతూ పెళ్లి తర్వాత నా కెరీర్ లో ఎలాంటి మార్పు రాలేదు. బాలీవుడ్ లో పెళ్లి తర్వాత కూడా చాలా మంది హీరోయిన్లు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు.అయితే ఈ విషయంలో టాలీవుడ్ లో మాత్రం ఇంకా మార్పు రాలేదు. ఇక్కడ పెళ్ళైన హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడానికి మేకర్స్ ఎంతగానో ఆలోచిస్తున్నారు. త్వరలోనే టాలీవుడ్ లో కూడా మార్పు వస్తుంది. అందుకు ఉదాహరణ నేనే అని కాజల్ తెలిపింది .నా భర్త నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి మాత్రం సమయం కేటాయిస్తానని ఆమె చెప్పుకొచ్చింది.