కల్కి నుంచి వచ్చేది ఆ ఒక్క పాటేనా!

పాన్‌ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్‌ సినిమా కల్కి 2898 ఏడీ ఈ సినిమాని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బిగ్గెస్ట్‌  సాన్‌ వరల్డ్‌ సినిమాగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ వరకు అందరు స్టార్ హీరోలు నటిస్తున్నారు.

ఇందులో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె ,దిశా పటాని హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ మే 9 నే విడుదల చేయాలనీ భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క పాట ఉండబోతుందంట. టాటక్కరా అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుందట..ఈ పాటలో ప్రభాస్ ,దిశా పటాని మధ్య వచ్చే స్టెప్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తుందని సమాచారం.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories