పోటీనుంచి తప్పుకుంటానన్న బొత్స ఝాన్సీ !!

విశాఖపట్నం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా బరిలో ఉన్న బొత్స ఝాన్సీ తాను ఈ ఎన్నికల్లో పోటీనుంచి తప్పుకుంటానని ప్రకటించారు. తాను తప్పుకోవడం మాత్రమే కాదండోయ్! తనతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజువాక బరిలో ఉన్న గుడివాడ అమర్నాధ్ ను కూడా బరిలోనుంచి తప్పిస్తానని ఆమె చెబుతున్నారు. కంగారు పడకండి.. ఆమె పోటీనుంచి తప్పుకోవడానికి కండిషన్లు వర్తిస్తాయండోయ్! విశాఖ స్టీలు ప్లాంటు ప్రభుత్వరంగంలోనే కొనసాగుతుందని ప్రధాని నరేంద్రమోడీ ఒక్క మాట చెబితే చాలుట! వీరిద్దరూ పోటీనుంచి తప్పుకుంటారట. ఆ సంగతి పోలింగుకు రెండు రోజుల ముందు చెబుతున్నారు. మోడీ గురించి మాట్లాడడానికి అసలు బొత్స సత్యనారాయణకే హక్కు లేదని.. ఒకవైపు కూటమి నాయకులు దెప్పి పొడుస్తూంటే.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఆయన భార్య కూడా తయారయ్యారు.

బొత్స ఝాన్సీ గతంలో కూడా ఒక దఫా ఎంపీగా చేశారు. ఒక కుటుంబం నుంచి ఒక తరంలో ఒక్కరు మాత్రమే రాజకీయాల్లో ఉండాలని ఒక విచిత్రమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జగన్మోహన్ రెడ్డి.. ఆ సిద్ధాంతం విలువలకోసమే తన సొంత చెల్లెలు షర్మిలకు రాజకీయాలు వద్దని ఆదేశించినట్టుగా చెప్పారు. అలాంటి జగన్ కు వేరే గత్యంతరం లేక, మరో మనిషి దొరక్క ఒకే కుటుంబానికి చెందిన ఒకే తరం నాయకులు బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్యే టికెట్, బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చారు.

అలాంటి ఝాన్సీ ఇప్పుడు స్టీలు ప్లాంట్ కోసం త్యాగమూర్తి అవతారం ఎత్తాలనుకుంటున్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ముఖ్యమని అంటున్న ఝాన్సీ.. గత అయిదేళ్లలో స్టీల్ ప్లాంట్ కోసం ఎన్నడైనా పెదవి విప్పి మాట్లాడారా? అనేది జనం ప్రశ్న. కనీసం ఆమె భర్త సత్యనారాయణ అయినా పెదవివిప్పలేదు. ఇప్పుడు మాత్రం మోడీకే సవాళ్లు విసురుతున్నారు.

బొత్స ఝాన్సీ చేస్తున్న ఇంకో కామెడీ ఏంటంటే.. జగన్ చేసిన ఒత్తిడి వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రెవేటీకరణ ఇన్నాళ్లూ జరగలేదట. విశాఖ పరిపాలన రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని అంటున్న ఝాన్సీ.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే… అక్కడ రాజధాని ఉండాల్సిందేనన్న కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారా? అని కూడా జనం నవ్వుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories