నిజమైన Telugumopo.com అంచనా : విజయమ్మ వీడియో!

ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతున్నదో ‘తెలుగు మోపో డాట్ కాం’ వారం రోజుల కిందటే అంచనా వేసింది. ఏపీలో ఎన్నికలను ప్రభావితం చేసేలాగా, గుంభనంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఒక వ్యవహారాన్ని  వారం రోజుల కిందటే బయటపెట్టింది. వారం రోజుల కిందట తెలుగుమోపో ఏదైతే చెప్పిందో.. ఇవాళ అదే నిజమైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక వీడియో సందేశం విడుదల చేయబోతున్నారని తెలుగుమోపో చెప్పింది. అచ్చంగా ఆ వార్త నిజమేనని నిరూపిస్తూ.. ఇవాళ విజయమ్మ వీడియో విడుదల చేశారు. తన బిడ్డ, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ, షర్మిలను ఆశీర్వదించి కడప ఎంపీ గెలిపించాలంటూ విజయమ్మ వీడియో సందేశం విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసం ఎంతో అంకిత భావంతో పనిచేశారని.. ఆయన బిడ్డ షర్మిల కూడా అదే అంకితభావంతో ప్రజలకోసం పాటుపడుతున్నదని.. ఆయనను అభిమానించినట్టే ఆయన బిడ్డను కూడా అభిమానించి, ఆదరించి గెలిపించాలని విజయమ్మ ఆ వీడియోలో కోరారు. విజయమ్మ విడుదల చేసిన వీడియో ఇప్పుడు ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. 

ఆ వీడియోలో ఎక్కడా కనీసం కొడుకు వైఎస్ జగన్ పేరును కూడా ప్రస్తావించకపోవడం విశేషం. కేవలం కూతురు కోసం మాత్రమే తాను పనిచేస్తున్నానని, తన మద్దతు కేవలం కూతురుకు మాత్రమే ఉన్నదని విజయమ్మ స్పష్టంగా చాటదలచుకుంటున్నట్టుగా ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది. 

అన్నాచెల్లెళ్లు ఇద్దరూ నామినేషన్ వేసిన తర్వాత.. వైఎస్ విజయమ్మ అమెరికాలోని తన మనవడు (షర్మిల కొడుకు) దగ్గరకు వెళ్లిపోయారు. ప్రచారం కోసం జగన్ ఒత్తిడి తట్టుకోలేక, అలా చేయడం ఇష్టం లేక వెళ్లిపోయినట్టు అంతా అనుకున్నారు. అయితే.. ఈ నెల 5వ తేదీన ‘అమెరికాలో సిద్ధం : వైఎస్ విజయమ్మ వీడియో సందేశం’ అనే శీర్షికతో తెలుగుమోపో డాట్ కామ్ ఒక కథనాన్ని అందించింది. కూతురు షర్మిలను గెలిపించాల్సిందిగా కోరుతూ విజయమ్మ వీడియో రూపొందుతోందని.. ప్రచారం చివరి దశకు చేరుకున్న సమయంలో దానిని విడుదల చేస్తారని తెలుగుమోపో ఆ కథనంలో పేర్కొంది. అచ్చంగా ఆ కథనంలో చెప్పినట్టుగానే వీడియో తయారైంది. షర్మిల గెలుపును మాత్రమే ఉద్దేశించి విజయమ్మ వీడియో రూపొందించారు. ఆ వీడియో ఇప్పుడు కడపలో మాత్రమే కాదు.. రాష్ట్రమంతా కూడా విస్తృతంగా సర్కులేట్ అవుతోంది. విజయమ్మ , కొడుకు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా దూరం పెట్టినట్టేనని ఆ వీడియో చూసిన పలువురు అనుకుంటున్నారు. 

Telugumopo.com published article few days back:

Video released by Vijayamma:

Related Posts

Comments

spot_img

Recent Stories