ఇదేక్కడి మాస్‌ మావ.. !

హీరో విజయ్‌ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్‌ సంకృత్యన్‌ కాంబినేషన్‌ లో  ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 దేవరకొండ పుట్టినరోజున ప్రకటించడం జరిగింది.  పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్న దీనిని నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

వీడీ 14 అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదలైన పోస్టర్ ఆసక్తి గా ఉంది. బీటలు పడ్డ పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం.. దాని మీద ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అని ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

‘టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ప్రేక్షకులకు ఒక ఎపిక్ లాంటి ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇవ్వనుందని, త్వరలో వీడీ 14 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారని తెలిపారు. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో కథ గురించి వచ్చిన కొన్ని వివరాలు సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి.

 ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇది విజయ్ దేవరకొండకి మొదటి డ్యూయల్ రోల్ సినిమా కాగా పక్క పక్కనే నటిస్తారా? లేక వేర్వేరు సమయాల్లో ఉన్న పాత్రలా? అనేది తెలియాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories