జగన్ కుట్రపై ఈసీ నిలతీత : జవాబుందా సార్?

జగన్మోహన్ రెడ్డి సర్కారు చాలా పెద్ద ఎత్తుగడే వేసింది. సహజంగానే వారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నుంచి చెప్పుకోలేనంత మద్దతు ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుచిత లబ్ధి చేకూర్చేలా వీరు ఎలాంటి ఆట ఆడదలుచుకున్నప్పటికీ ఆయన వైపు నుంచి సహకారం లభిస్తుంది. ఈ నమ్మకంతోనే వారు పెద్ద కుట్ర రచన ప్లాన్ చేశారు. ఎన్నికల కోడ్ రావడానికి రెండు వారాలకు ముందే రకరకాల సంక్షేమ పథకాలకు జగన్ మోహన్ రెడ్డి బటన్ లు నొక్కేసి.. ఇదిగో మీ ఖాతాల్లో డబ్బులు వేసేస్తున్నానంటూ ఆర్భాటంగా ప్రకటించారు. తీరా నెలలు గడిచినా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు మాత్రం పడలేదు. పోలింగ్ తేదీ ముంచుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంతో కాలం కిందట బటన్లు నొక్కిన పథకాల తాలూకు డబ్బులు ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో వేయడానికి అనుమతి కావాలంటూ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరడం.. ఈ అర్తరహితమైన కోరికను ఎన్నికల సంఘం తిరస్కరించడం ఆటోమేటిగ్గా జరిగాయి.

అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడితో ఊరుకుంటే విశేషమేముంది. ప్రజల ఖాతాల్లో డబ్బులు పడకుండా పోయిన వైనాన్ని కూడా ఆయన తన ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని చూస్తూ వచ్చారు. ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందనివ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డారంటూ తలా తోకాలేని అడ్డగోలు వాదనలు ప్రజల ఎదుట వినిపించారు. నిజానికి జగన్ తిట్టింది చంద్రబాబునే గాని, ఆ తిట్లు అన్నీ కూడా ఎన్నికల సంఘానికే తగులుతాయి అన్నది అందరికీ తెలిసిన సంగతి.

ఎన్నికల సంఘం కూడా కాస్త గట్టిగానే స్పందించింది. మార్చి మొదటి వారంలో బటన్లు నొక్కేస్తే.. ఇప్పటిదాకా అసలు లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు చేరకుండా ఎందుకు ఆలస్యమైంది.. ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది. సరిగ్గా ఎన్నికలకు ముందుగా 14,165 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలలో పడేలాగా జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రకు వ్యూహరచన చేశారు. ఆ వ్యూహాన్ని వీగిపోయేలా చేసిన ఎన్నికల సంఘం.. ఎప్పుడో నొక్కిన బటన్లో ఇప్పటిదాకా డబ్బులు ఎందుకు వెళ్లలేదో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా వారి కుట్రను ప్రజలు ముందు నగ్నంగా ఆవిష్కరించింది. పోలింగుకు రెండు రోజుల ముందు ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయాలనుకోవడం కోడ్ ఉల్లంఘన అవుతుందని కూడా  హెచ్చరించింది.

ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ డబ్బులను విడుదల చేయాలని దీనికి పోలింగ్ ముగిసిన తర్వాత అవసరమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని ఈసీ పేర్కొనడం విశేషం. ఏదో ఒక మాయ చేసి ప్రజలను మభ్యపెట్టి వక్రమార్గాల్లో లబ్ధి పొందాలనుకున్న వైఎస్ఆర్సిపి కుట్రలు చివరికి వారి పరువు తీసేలా తయారయ్యాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories