ఇంకొన్ని ‘వేటు’లు పడితే.. జగన్‌కు చిక్కులే!

జగన్మోహన్ రెడ్డి పట్ల వీరవిధేయతను ప్రదర్శించుకోవడం ఒక్కటే తమ జీవితాశయం చెలరేగుతున్న పోలీసు అధికారుల మీద ఎన్నికల కమిషన్ వేటు వేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలింగ్ రోజు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు పెచ్చుమీరుతూ ఉండడం, ప్రతిచోట కూడా వైఎస్సార్ సీపీ గూండాలకు పోలీసులు తొత్తుల్లా వ్యవహరిస్తుండడం వంటి ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజూ కొందరు అధికారుల మీద బదిలీ  వేటు, విధులనుంచి తప్పించడం వంటి ఆదేశాలు వస్తూనే ఉన్నాయి. జగన్ భక్తులందరూ పక్కకు తప్పుకోవాల్సి వస్తోంది. మిగిలిన చోట్ల కూడా జగన్ భక్తులు, తమ మితిమీరిన భక్తిని ప్రదర్శించుకోవడానికి అడ్డగోలుగా చెలరేగితే.. రాబోయే ఒకటిరెండు రోజుల్లో వారి మీద కూడా వేటు పడుతుందని.. పాపం పోలింగ్ నాడు.. పోలీసు భక్తుల సాయంతో… చెలరేగిపోయి అడ్డదారుల్లో గెలవచ్చునని అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి చిక్కులు తప్పవని ప్రజలు అనుకుంటున్నారు.

తాజాగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లికి కొమ్ముకాసిన పోలీసు అధికార్ల మీద ఈసీ వేటు వేసింది. ఇద్దరు సీఐలు, ఒక ఎస్ లను విధులనుంచి తప్పించింది. తెలుగుదేశం కార్యకర్తలను తుపాకీ చూపి బెదిరించడం, వైసీపీ నాయకులకు హింసకు దిగుతున్నా సరే పట్టించుకోకుండా వారికి అనుకూలంగా వ్యవహరించడం, తెలుగుదేశం వారిమీదనే అక్రమ కేసులుబనాయించి వేధించడం వంటి ఆరోపణలు వీరి మీద ఉన్నాయి. మొత్తానికి ఈ పోలీసు అధికారులు, తెలుగుదేశం అనేక ఫిర్యాదులుచేసిన తర్వాత, ఆధారాలు కూడా సమర్పించిన తర్వాత పక్కన పెట్టబడ్డారు.

ఇప్పటికే పలు జిల్లాల్లో ఎస్పీలను పక్కకు తప్పించారు. కొందరు జిల్లా కలెక్టర్లను కూడా పక్కకు తప్పించారు. విజయవాడ నగర కమిషనర్, అనంతపురం రేంజి డీఐజీలను కూడా పక్కకు తప్పిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీచేసింది. కొన్ని చోట్ల పోలీసు అధికారులు.. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తమ పని తాము చేసుకుని పోతున్నారు. అయితే.. ఇప్పటికే.. అడ్డదారుల్లో తమ మాట చెల్లుబాటు  అయ్యే పరిస్థితి చేజారిపోతున్నదని వైసీపీ నాయకులు భయపడుతున్నారు. ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా.. ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అధికారులను ఇష్టమొచ్చినట్టుగా బదిలీచేస్తున్నారని.. ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయనే నమ్మకం లేకుండాపోతోందని ఆవేదన చెందడం పెద్ద కామెడీ. కానీ, ప్రజల దృష్టిలో మాత్రం.. ఇంకా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న మరికొందరు నాయకుల బదిలీ జరిగిందంటే గనుక.. జగన్ ఎన్నికల్లో ఇబ్బందులు పడతారని అంటున్నారు. పోలింగ్ నాడు విధ్వంసం ద్వారా జగన్ గెలవాలని అనుకున్నారు. అన్ని కీలక స్థానాల్లో నిజాయితీగల అధికారులు వస్తే ఆయన పప్పులు ఉడకవని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories