పెళ్లి వద్దు కానీ.. అది కావాలంటున్న చిట్టి!

జాతిరత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంది.  జాతిరత్నాలు  సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిట్టి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో మెరిసింది.

ఆ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా దూసుకుపోతుంది..ఇక ఈ సినిమా సక్సెస్ టాక్ ను అయితే అందుకుంది. ఇదిలా ఉండగా.. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్బంగా ఎన్నో విషయాలను అందరికీ చెప్పింది. అలాగే తనకు పెళ్లిపై హోప్ లేదు కానీ.. పిల్లలు మాత్రం కావాలంటూ చెప్పుకొచ్చింది.

ఇటీవల ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ.. ‘నా మ్యారేజ్ పైన నాకు ఆశ కూడా లేదు. ఒకవేళ అయితే అవ్వోచ్చు. కానీ కచ్చితంగా నేను పెళ్లి చేసుకోవాలి అని నాకు లేదు. కానీ  పిల్లలు అంటే మాత్రం చాలా ఇష్టం.. కచ్చితంగా అమ్మ అవుతాను. పెళ్లి గురించి ఆలోచించాలి అని చెప్పుకొచ్చింది. అయితే తండ్రి బాధ్యతలు కూడా ఉండాలి. ఒక చైల్డ్‌ని తల్లీతండ్రి ఇద్దరు కలిసే పెంచాలి. దాంట్లో నాకు డౌట్ లేదు. కానీ పెళ్లి అనేది ఆలోచించాలి అని చెప్పింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories