జగన్ ఓటమి ఖరారయ్యాకే.. టోన్ మార్చిన మోడీ!

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇప్పటికి రెండు విడతలుగా ఏపీలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ప్రధాని మోడీ ప్రసంగం విషయంలో  ఈ రెండు విడతల్లోనూ చాలా తేడా ఉంది. రెండో విడతలో అనకాపల్లి, రాజమండ్రిల్లో నిర్వహించిన సభల్లో మోడీ ఒక రేంజిలో నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ, జగన్ ప్రభుత్వపు దుర్మార్గాలను తూర్పారపట్టడంలోనూ మోడీ చాలా సీరియస్ గా మాట్లాడారు. అయితే విశ్లేషకులు భావిస్తున్న దాన్ని బట్టి.. ఏపీలో ట్రెండ్ ను గమనించిన తర్వాతే.. మోడీ మాట తీరు కూడా మారిందని తెలుస్తోంది.

ప్రధాని నరేంద్రమోడీ తొలివిడతలో చిలకలూరి పేట బహిరంగ సభలో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో కలిసి పాల్గొన్నారు. ఆ సభలో మోడీ ప్రసంగం  మితవాద ప్రసంగంలాగా సాగింది. ఆద్యంతం ఎన్డీయే కూటమికి 400 సీట్లు కట్టబెట్టండి అనే మాట తప్ప.. స్థానికంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క దుర్మార్గాల గురించి  మోడీ అంతగా ప్రస్తావించలేదనే విమర్శ వినిపించింది.

అయితే ఏపీలో విజయావకాశాలు ఎవరివైపు ఉంటాయో క్లారిటీలేక మోడీ జాగ్రత్త పడుతున్నారేమో అనే వాదన కూడా వినిపించింది. ఎందుకంటే.. గత అయిదేళ్లలో కేంద్రంలో మోడీ సర్కారు ఏ బిల్లు ప్రవేశపెట్టినా కూడా.. దానికి వైఎస్సార్ కాంగ్రెస్ కూడా పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తూ.. ఆయా బిల్లులు నెగ్గడానికి, మోడీ ప్రభుత్వం ఇబ్బంది పడకుండా ఉండడానికి సహకరిస్తూ వచ్చింది. అలాంటినేపథ్యంలో ఏపీలో మళ్లీ వైసీపీ గెలిచేట్లయితే కేంద్రంలో అనవసరంగా వారి బలాన్ని దూరం చేసుకున్నట్టు అవుతుందేమో అనే భయంతో వారి గురించి సాత్వికంగా మాట్లాడినట్టు అంతా అనుకున్నారు.

కానీ అనకాపల్లి, రాజమండ్రి సభల్లో జగన్ సర్కారు దుర్మార్గాలను మోడీ ఒక రేంజిలో ఆడుకున్నారు. కేంద్ర నిఘావర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో జగన్ దారుణంగా ఓడిపోతున్నట్టు ప్రధానికి సమాచారం అందిందని.. అందుకే ఆయన డోస్ పెంచారని తెలుస్తోంది. ఎటూ జగన్ ఓటమి ఖరారు అని విశ్వసనీయంగా తెలిసిన తర్వాత.. మోహమాటం అనవసరం అనే ఉద్దేశంతోనే విమర్శల దాడి  పెంచినట్టుగా చెబుతున్నారు. జగన్ భూమాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాలను కూడా మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమరావతికి జరిగిన ద్రోహాన్ని, పోలవరం వైఫల్యాన్ని, హిందూ పుణ్యక్షేత్రాల విషయంలోనూ, తెలుగు బాష విషయంలోనూ జరుగుతున్న అన్యాయాన్ని కూడా మోడీ ప్రస్తావించారు. మోడీ మాటల దాడిలో తీవ్రత పెరగడం జగన్ ఓటమి గురించిన స్పష్టమైన సంకేతం అని అంతా అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories