ఎన్టీఆర్ లేకుండానే దేవర షూటింగ్‌!

మాస్‌ యాక్షన్‌ హీరో ఎన్టీఆర్‌ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర. ఈ సినిమాని టాలీవుడ్ మాస్‌ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తుంది.  బాలీవుడ్‌ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో ప్రతినాయకుని గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 5 నా విడుదల చేయాలనీ భావించిన కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది .ఈ సినిమాను అక్టోబర్ 10 న దసరా కానుకగా విడుదల చేయనున్నారు.  

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ సినిమాతో పాటు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారుతాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ అటు దేవర ఇటు వార్ 2 షూటింగ్ లతో బిజీ గా గడుపుతున్నారు.అలాగే దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండటంతో ఎన్టీఆర్ లేకుండానే దేవర షూటింగ్ నిర్వహిస్తున్నాడు.

సినిమాలో ఎన్టీఆర్ లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారు.అలాగే దర్శకుడు కొరటాల యంగ్ హీరో సత్యదేవ్ నటిస్తున్న “కృష్ణమ్మ ” సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవర షూటింగ్ చేస్తునే ఏమాత్రం గ్యాప్ దొరికిన కృష్ణమ్మ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు చూసుకుంటున్నారు.త్వరలోనే దేవర షూటింగ్ ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories