మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన విరూపక్ష ముద్దుగుమ్మ!

మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ నిర్మాతలకు లక్కీ లెగ్‌ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలుగులో హీరోయిన్‌ అంటే ఫస్ట్‌ పేరు సంయుక్త పేరునే వినిపిస్తుంది. అంతలా ఈ ముద్దుగుమ్మ తన సత్తాని చాటింది. ప్రస్తుతం ఈ భామ చేతి లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శర్వానంద్,  నిఖిల్ లాంటి యంగ్ హీరోల సినిమాలలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా మరో యంగ్ హీరో సినిమాలో ఈ భామ హీరోయిన్ గా ఆఫర్ అందుకుంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ భామ హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం. గతేడాది ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ అనే మూవీలో నటిస్తున్నాడు.

ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లు సమాచారం. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. లుధీర్ బైరెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రూ. 50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories