తారక్‌ – ప్రశాంత్‌ నీల్‌ సినిమాకు రంగం సిద్దం!

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. మాస్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ కొరటాల శివ డైరెక్షన్‌ లో ఎన్టీఆర్‌ ఈ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వార్‌ 2 సినిమా షూటింగ్ తో ముంబైలో ఉన్నాడు. దేవర్‌ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ గా ఉంది.

వార్ 2 కూడా  వచ్చే ఏడాది థియేటర్ల లోకి రానుంది. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ అప్డేట్ పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు గతంలో వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రం ను నిర్మించనున్నారు.

అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20 న ఈ చిత్రం కి సంబందించిన అనౌన్స్ మెంట్ రానుంది. అదే రోజున టైటిల్ కూడా రివీల్ ను చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.  దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories