ఎన్నికలలో గెలవాలంటే ఓటర్లకు డబ్బు పంచవలసిన సమయం ఆసన్నం అయిపోయింది. ఇక నేలమాలిగల నుంచి రహస్య స్థావరాల నుంచి డబ్బు కట్టలను బయటకు తీయవలసిన సందర్భం ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. ఎమ్మెల్యే ఎంతగా డబ్బు ఖర్చు పెట్టగలిగినవాడు అయినప్పటికీ.. ఇంటింటికి తనే తీసుకువెళ్లి డబ్బు ఇవ్వడం అనేది అనూహ్యమైన సంగతి. సాధారణంగా ఎంతో విశ్వసనీయులైన పార్టీ కార్యకర్తల ద్వారా మాత్రమే ఓటర్లకు డబ్బు పంపిణీ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ దఫా ఎమ్మెల్యే అభ్యర్థులు నమ్మడంలేదు. కార్యకర్తలను స్థానిక నాయకులను పక్కనపెట్టి వాలంటీర్ల ద్వారా నలుగురు పంపిణీ చేయించడం మాత్రమే సేఫ్ అనేవారు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.
అందుకే తమ పార్టీ కార్యకర్తలుగా ఉంటూ వాలంటీరు పదవిని వెలగబెడుతున్న వారిని ఈ పని కోసం వాడుకోవాలని అభ్యర్థులనుకుంటున్నారట. ఆల్రెడీ రాష్ట్రంలో 90000 మంది రాజీనామా చేసి ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే తమ వేతనం 10000 అవుతుంది అనే ఆశతో మిగిలినవారు రాజీనామా చేయడం లేదు. ప్రస్తుతానికి రాజీనామాలు చేసేసి అందుబాటులో ఉన్న వాలంటీర్లు అందరిని చలివిడిగా వాడుకుంటూ వారి ద్వారా డబ్బు పంపిణీ చేయించాలనేది వైసిపి వ్యూహంగా ఉంది.
అయితే ఈ ప్రయత్నం పార్టీలో అంతర్గతంగా ముసలం పుట్టిస్తుంది. స్థానిక నాయకులను విస్మరించి వారి చేతికి డబ్బులు ఇవ్వకుండా వాలంటీర్ల ద్వారానే పెంచాలని చూసుకోవడం వలన.. పార్టీ తమల అనుమానిస్తున్నట్లుగా తయారైందిని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కోసం మనస్ఫూర్తిగా పని చేయలేము అని కూడా అంటున్నారు. మరి వీరి భయాలు ఆందోళనలు ఎలా మనకు తీసుకుంటాయో చూడాలి.